Formar indian captain master sachin tendulkar asked puzzling question fans, about a video which is related to the situation of a cricket match.
#sachintendulkar
#viratkohli
#indvwi
#teamindia'swestindiestour2019
#PuzzlingQuestion
#cricket
క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు ఓ క్లిష్ట ప్రశ్నను సంధించాడు. బుధవారం ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన మాస్టర్.. అందులో బ్యాట్స్‌మన్ ఔటా ? నాటౌటా? మీరు అంపైర్ అయితే ఏం చేసేవారని అడిగాడు. సంక్లిష్టమైన పరిస్థితిని కలిగి ఉన్న ఈ వీడియోను ఓ స్నేహితుడు పంపిచాడని సచిన్ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోలో బౌలర్ వేసిన బంతి నేరుగా వికెట్ బెయిల్స్‌ను తాకినప్పటికి.. అవి కిందపడలేదు. పైగా ఒక బెయిల్ పక్కకు జరిగింది. అయితే దీన్ని అంపైర్ నాటౌట్ ఇచ్చినట్లు తెలుస్తున్నప్పటికి వీడియోలో మాత్రం స్పష్టత లేదు. ఈ సందర్భంలో మీరు అంపైర్‌గా ఉంటే ఏం చేసేవారని అభిమానులను సచిన్ ప్రశ్నించాడు.